vaccine: 10 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి: ఐఎఫ్‌పీఎంఏ

10 vaccines will available
షార్ట్స్‌లో చూడండి
కరోనాను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయన్న విషయంపై అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థల సమాఖ్య (ఐఎఫ్‌పీఎంఏ) కీలక విషయాలు తెలిపింది.  

వచ్చే ఏడాది వేసవి నాటికి మొత్తం 10 కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు రాబట్టాయని తెలిపింది. అయినప్పటికీ వ్యాక్సిన్ ను అతి త్వరగా తీసుకురావాలన్న లక్ష్యాల నేపథ్యంలో భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపింది.  

ఇవే కాకుండా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, నోవావాక్స్‌, సనోఫీ పాశ్చర్‌, మెర్క్‌, జీఎస్కే వ్యాక్సిన్లు కూడా త్వరలోనే మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని
ఐఎఫ్‌పీఎంఏ‌ జనరల్‌ థామస్‌ క్వెనీ అభిప్రాయపడ్డారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఔషధ తయారీ, బయోటెక్‌ సంస్థలు వ్యాక్సిన్ పరిశోధనలకు భారీగా ఖర్చు చేశాయని చెప్పారు.  

ఆయా సంస్థలు తమ వ్యాక్సిన్‌పై పేటెంట్ హక్కుల్ని రక్షించుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ తయారీకి తప్పనిసరిగా లైసెన్స్‌ ఇవ్వాల్సిందేనంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ సదస్సులో కొన్ని దేశాలు చేసిన ప్రతిపాదనలు సరికాదని చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి అనేది అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన ప్రక్రియ అని తెలిపారు. లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలో వ్యాక్సిన్‌ను అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని థామస్‌ క్వెనీ తెలిపారు.
Go Back to Shorts
vaccine
Moderna
USA

More Telugu News