అర్నాబ్ గోస్వామి తాత్కాలిక బెయిలు పొడిగించిన సుప్రీంకోర్టు
- ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని చెప్పలేము
- ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేకపోయారు
- వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టడం తీవ్రమైన నేరం
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకునే విధంగా గోస్వామి ప్రేరేపించినట్టు చెప్పలేమని అన్నారు. గోస్వామిపై ఉన్న ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేకపోయారని చెప్పారు. తన అధికారాన్ని ఉపయోగించడంలో బాంబే హైకోర్టు విఫలమైందని అన్నారు. ఏ వ్యక్తికైనా సరే ఒక్కరోజు వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టడం కూడా తీవ్రమైన విషయమేనని చెప్పారు. క్రిమినల్ చట్టాలు ప్రజలను వేధించే సాధనంగా మారకూడదని అన్నారు.