మారుతి వేగన్ ఆర్ పై సెటైర్ వేసిన టాటా మోటార్స్!
- ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో 2 స్టార్స్ మాత్రమే
- అత్యంత భద్రతైన కారు టాటా టియాగో
- సోషల్ మీడియాలో టాటా మోటార్స్ పోస్ట్
ఈ పోస్ట్ లో ఓ చెక్క బండికి ఉన్న చక్రం ఊడిపోయినట్టుగా క్రియేట్ చేసిన చిత్రాన్ని పోస్ట్ చేసిన టాటా మోటార్స్, "భద్రతను ఎంతమాత్రమూ మరచిపోకూడదన్నది చాలా ముఖ్యం. మీ కారు వైపు వెళ్లేటప్పుడు స్మార్ట్ గా ఉండండి. టియాగోను ఎంచుకోండి. ఈ సెగ్మెంట్ లో అత్యంత భద్రతతో ఉన్న కారు ఇదే. జీఎన్సీఏపీ నుంచి 4 స్టార్ రేటింగ్ ఉంది" అని పేర్కొంది.ఇక ఈ పోస్ట్ లో వాగన్ ఆర్ పేరును వెల్లడించక పోయినా ఈ పోస్ట్ వైరల్ అయింది.