బిగ్ బాస్ నుంచి నేడు మెహబూబ్ అవుట్?
- ఇప్పటివరకూ 10 మంది అవుట్
- మెహబూబ్ కు అతి తక్కువ ఓట్లు
- నేడు బయటకు రానున్న మెహబూబ్
ఇక నామినేషన్ లో ఉన్న వారిలో అరియానా, మెహబూబ్ లకు అతి తక్కువ ఓట్లు వచ్చాయని, వీక్షకులకు అరియానాపై కోపం ఎక్కువగా ఉన్నా, రోబో టాస్క్ నుంచి మెహబూబ్ పై వ్యతిరేకత మరింతగా పెరిగిందని విశ్లేషిస్తున్నారు.
కాగా, ఇప్పటివరకూ బిగ్ బాస్ హౌస్ నుంచి సూర్యకిరణ్, కల్యాణి, దేవీ నాగవల్లి, స్వాతి దీక్షిత్, సుజాత, కుమార్ సాయి, దివి, అమ్మ రాజశేఖర్ లు ఎలిమినేట్ కాగా, ఆరోగ్యం బాగాలేదంటూ గంగవ్వ, నోయల్ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో లీకువీరులు చెబుతున్నట్టుగా మెహబూబ్ ను హౌస్ నుంచి పంపించేస్తారా? లేక నాగ్ ఏవైనా ట్విస్ట్ లిస్తారా? అన్నది తెలియాలంటే, మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.