ధైర్యంగా గళమెత్తి పోరాటం చేయడమనేది తెలంగాణ ప్రజల్లోనే ఉంది: పవన్ కల్యాణ్
- జనసేన తెలంగాణ విభాగం కమిటీలతో పవన్ భేటీ
- కార్యవర్గానికి కర్తవ్యబోధ చేసిన జనసేనాని
- సమస్యలపై పోరాటాలు చేద్దాం అంటూ పిలుపు
ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో కావొచ్చు, కరీంనగర్ జిల్లాల్లోని ఓ గ్రామంలో కావొచ్చు, లేక పాలమూరు రైతులు, కూలీల ఇబ్బందులు కావొచ్చు... ఎక్కడ, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా స్పందిద్దామని ఉద్బోధించారు. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు కమిటీలతో సమావేశమై చర్చిద్దామని తెలిపారు. ధైర్యంగా గళమెత్తి పోరాటం చేయడమనేది తెలంగాణ ప్రజల్లోనే ఉందని అన్నారు. యువకులు, విద్యార్థులు రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్లి ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.