16 Years Girl: 60 ఏళ్ల వ్యక్తి అత్యాచారం కారణంగా గర్భవతి.. బిడ్డకు జన్మనిచ్చిన టీనేజ్ అమ్మాయి!

  • 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
  • భయంతో తల్లికి కూడా చెప్పని బాధితురాలు
  • బిడ్డకు జన్మనిచ్చి షాప్ వద్ద వదిలి వెళ్లిన వైనం
Delhi Teen Raped Allegedly By 60 Year Old Gives Birth On Terrace

దేశ రాజధాని ఢిల్లీలో హృదయం ద్రవించే ఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన 16 ఏళ్ల బాలిక తన ఇంటి టెర్రెస్ పై బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం... అక్టోబర్ 31న వారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డను వదిలేసి వెళ్లారని ఫోన్ లో ఎవరో చెప్పారు. వెంటనే ఆ అడ్రస్ కు వెళ్లిన పోలీసులు అక్కడ ఉన్న చిన్నారిని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ బిడ్డ ఎవరనే విషయం మాత్రం పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పలేదు. దీంతో, వారు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక వద్ద బిడ్డ ఉన్న సన్నివేశాలు ఫుటేజీలో ఉన్నాయి.

ఫుటేజీ ఆధారంగా సదరు బాలికను పోలీసులు ట్రేస్ చేశారు. ఆమెను విచారించగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎనిమిది, తొమ్మిది నెలల క్రితం 60 ఏళ్ల ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు వెల్లడించింది. అయితే, భయంతో ఆ విషయాన్ని తన తల్లికి కూడా చెప్పలేదని తెలిపింది. ఇంటి టెర్రెస్ పై బిడ్డకు జన్మనిచ్చానని చెప్పింది. ఆ తర్వాత బిడ్డను వస్త్రంతో కప్పి, ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద వదిలి వెళ్లానని తెలిపింది.

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల  కింద కేసు నమోదు చేశారు. రేప్ చేసిన వ్యక్తి బాలిక ఇంటి వద్దే ఓ కిరాణా షాపును నడుపుతున్నాడు. బాలిక తల్లి ఇళ్లల్లో పనిచేస్తుంది. 

More Telugu News