కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న బీజేపీ నేత రావుల

BJP leader Ravula Sridhar Reddy joins TRS
  • బీజేపీకి గుడ్ బై చెప్పిన రావుల శ్రీధర్ రెడ్డి
  • శ్రీధర్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన కేటీఆర్
  • కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భద్రంగా ఉంటుందన్న రావుల
బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన రావుల శ్రీధర్ రెడ్డి ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శ్రీధర్ రెడ్డిని కేటీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

శ్రీధర్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన నేత. ఆయన వెంట పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు సీఎం కేసీఆర్ చేతిలోనే భద్రంగా ఉంటుందని అన్నారు. తాను గత 11 ఏళ్లుగా బీజేపీలో ఉన్నానని, వివిధ స్థాయుల్లో పనిచేశానని, అయితే రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ, హైదరాబాద్ ఎంతగానో అభివృద్ధి చెందుతాయని అన్నారు.
Go Back to Shorts
Ravula Sridhar Reddy
TRS
BJP
KTR
Telangana

More Telugu News