deekshit: కిడ్నాప్ చేసిన చిన్నారి దీక్షిత్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు

deekshit dead
షార్ట్స్‌లో చూడండి
మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాపర్లు హత్య చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఆ బాలుడిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో  అతడి తల్లిదండ్రులు రంజిత్‌, వసంత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలించారు. కిడ్నాపర్లు టెక్నాలజీ వాడుతూ పోలీసులకు చిక్కకుండా వసంతకు ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేశారు.  

కిడ్నాపర్లు ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేస్తుండడంతో వారిని ట్రేస్ చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. కిడ్నాప్ చేసిన దుండగులు వసంతను రూ. 45 లక్షలు డిమాండ్ చేశారు. అయితే, ఆ డబ్బు తీసుకుని వెళ్లినప్పటికీ కిడ్నాపర్లు దాన్ని తీసుకోవడానికి రాలేదు. చివరకు బాలుడిని హత్య చేశారు. ఆ బాలుడి మృతదేహం గుట్టల్లో లభ్యమైనట్లు తెలిసింది.
Go Back to Shorts
deekshit
Mahabubabad District

More Telugu News