ఏ మాత్రమూ తగ్గని దగ్గు... అరుదైన అవకాశాన్ని వదులుకున్న మెలానియా ట్రంప్!
- నేడు భర్తతో కలిసి ప్రచారంలో ఉండాల్సిన మెలానియా
- విపరీతంగా దగ్గుతూ ఉండటంతో పర్యటన రద్దు
- వెల్లడించిన మెలానియా అధికార ప్రతినిధి
"రోజురోజుకూ మెలానియా ట్రంప్ ఆరోగ్యం చక్కబడుతోంది. అయితే, ఇంతవరకూ దగ్గు మాత్రం తగ్గలేదు. ముందుజాగ్రత్త చర్యగా ఆమె తన ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు" అని స్టెఫానీ గ్రీషామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల ఆరంభంలో ట్రంప్, మెలానియాలతో పాటు వారి కుమారుడు బారోన్ కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.