బాలీవుడ్ లో ఇలియానాకు మరో ఛాన్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ లో ఇలియానాకు మరో ఛాన్స్!

Ileana in Unfair and Lovely
  • 'అన్ ఫెయిర్ & లవ్లీ'లో ఇలియానా
  • థ్రిల్ అవుతున్నానన్న ముద్దుగుమ్మ  
  • కథనం చాలా ఫన్నీగా ఉంటుందన్న ఇల్లీ  
ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రు నీబోన్ తో లవ్ బ్రేకప్ అయ్యాక ఇలియానా మళ్లీ సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలు చేయాలని కూడా ప్రయత్నించినా ఇక్కడ వర్కౌట్ కాలేదు. దాంతో మళ్లీ బాలీవుడ్ లోనే ప్రయత్నాలు కొనసాగించింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు తాజాగా ఓ హిందీ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.

ఈ సినిమా పేరు 'అన్ ఫెయిర్ & లవ్లీ'. రణ్ దీప్ హుడా హీరోగా నటించే ఈ చిత్రానికి బల్విందర్ సింగ్ జనువా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం వివరాలను ఈ రోజు ప్రకటించారు. సోనీ పిక్చర్స్ తో కలసి ఈ చిత్రాన్ని మూవీ టన్నెల్ ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది.

తెల్లని మేని ఛాయ పట్ల మన దేశంలోని అమ్మాయిలలో వుండే వ్యామోహాన్ని ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని వినోద భరితంగా తెరకెక్కిస్తారు. నల్లని మేని ఛాయ గల ఒక యువతి ఈ 'వర్ణ' వివక్షకు వ్యతిరేకంగా జరిపే పోరాటాన్ని ఇందులో ఫన్నీగా చెప్పనున్నారు.

ఇక ఈ సినిమాలో రణ్ దీప్ హుడా సరసన నటిస్తున్నందుకు ఎంతో థ్రిల్ ఫీలవుతున్నానని ఇలియానా పేర్కొంది. 'ఈ సినిమా కథనం నాకెంతో నచ్చింది. ఏదో సందేశం ఇస్తున్నట్టుగా కాకుండా, విషయాన్ని ఫన్నీగా వినోదాత్మకంగా చెప్పే తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు' అని చెప్పింది ఇల్లీ బ్యూటీ.    
Ileana
Bollywood
Randeep Hooda

More Telugu News