ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్... రెండు మార్పులతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్

Rajasthan Royals won the toss and elected bat first against Delhi Capitals
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ లో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ తో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. బ్యాటింగ్ స్వర్గధామం షార్జాలో జరగనున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలో దిగుతోంది.

సమష్టిగా ఆడుతూ సత్ఫలితాలు రాబడుతున్న ఢిల్లీ ఈ మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో టాప్ కు చేరుతుంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతోంది.

మరోవైపు, స్టీవ్ స్మిత్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ కు ఈసారి టోర్నీలో నిరాశాజనకంగా సాగుతోంది. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ జట్టు 3 మ్యాచ్ లలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ కోసం టామ్ కరన్, అంకిత్ రాజ్ పుత్ లను పక్కనబెట్టారు. వారి స్థానంలో ఆండ్రూ టై, వరుణ్ ఆరోన్ తుదిజట్టులోకి వచ్చారు.
Go Back to Shorts
Rajasthan Royals
Toss
Bowling
Delhi Capitals
Sharjah
IPL 2020

More Telugu News