Salmya Hayek: హిందూ దేవత లక్ష్మీదేవిపై భక్తిభావం ప్రకటించిన హాలీవుడ్ నటి

  • ట్విట్టర్ లో స్పందించిన సల్మా హయెక్
  • లక్ష్మీదేవిపై మనసు లగ్నం చేసి ధ్యానం చేస్తానన్న నటి
  • సల్మా ట్వీట్ కు విశేష స్పందన
Hollywood actress Salma Hayek tweets about Hindu goddess Lakshmi Devi

హాలీవుడ్ తార సల్మా హయెక్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. డెస్పరాడో, వైల్డ్ వైల్డ్ వెస్ట్, ఫ్రిడా, స్పై కిడ్స్-3, ఒన్స్ అపాన్ టైమ్ ఇన్ మెక్సికో వంటి చిత్రాలతో సల్మా హయెక్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. మెక్సికో దేశానికి చెందిన సల్మా తాజాగా తన ట్వీట్ లో హిందూయిజంపై అభిమానం ప్రదర్శించారు.

ఎప్పుడైతే నాలోని అంతర్గత సౌందర్యంతో సంధానం అవ్వాలనుకుంటానో, ఆ సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిపై దృష్టి లగ్నం చేసి ధ్యానం చేస్తాను అంటూ సల్మా హయెక్ ట్వీట్ చేశారు. అంతేకాదు, లక్ష్మీదేవి అమ్మవారి ఫొటోను కూడా పంచుకున్నారు. నిన్న సల్మా చేసిన ఈ ట్వీట్ కు ఇప్పటివరకు 28.9 వేల లైకులు, 7.6 వేల రీట్వీట్లు వచ్చాయి. ఎంతోమంది ఆమెను అభినందిస్తూ సందేశాలు పంపారు.


More Telugu News