అత్యంత పొడవైన అటల్ టన్నెల్ వద్ద ముద్దుగుమ్మ ప్రణీత పోజులు
- హిమాచల్ ప్రదేశ్ లో భారీ సొరంగమార్గం
- రెండు రోజుల క్రితం ప్రారంభించిన ప్రధాని
- టన్నెల్ గుండా ప్రయాణించామన్న ప్రణీత
తాజాగా, ప్రముఖ హీరోయిన్ ప్రణీత ఓ షూటింగ్ సందర్భంగా మనాలి వెళ్లారు. ఈ క్రమంలో చారిత్రాత్మక అటల్ టన్నెల్ ను సందర్శించారు. అక్కడ ఫొటోలకు పోజులిచ్చారు. దీనిపై ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ, ఇవాళ ఈ చారిత్రాత్మక సొరంగమార్గం గుండా ప్రయాణించానని వెల్లడించారు. ఈ టన్నెల్ కారణంగా తమకు కొన్ని గంటల మేర ప్రయాణ సమయం ఆదా అయిందని ప్రణీత వివరించారు. ప్రస్తుతం ప్రణీత హంగామా-2 చిత్రంలో నటిస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో చిత్రబృందంతో పాటు ప్రణీత మనాలి చేరుకున్నారు.