భారత ఐటీ నిపుణులకు శుభవార్త... హెచ్1బీ వీసాలపై నిషేధం ఎత్తివేయాలంటూ కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలు
- గత జూన్ లో ట్రంప్ నిర్ణయం
- డిసెంబరు వరకు హెచ్1బీ వీసాలపై నిషేధం
- న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పలు సంస్థలు
ఈ ఏడాది జూన్ లో హెచ్1బీ వీసాలపై డిసెంబరు వరకు నిషేధం విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం లక్షల సంఖ్యలో విదేశీ ఐటీ నిపుణులకు శరాఘాతంలా తాకింది. ముఖ్యంగా భారత ఐటీ నిపుణులకు ఈ నిర్ణయం తీవ్ర అసంతృప్తి కలిగించింది.
అయితే వీసాలపై ట్రంప్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమెరికా ఉత్పత్తిదారుల జాతీయ సమాఖ్య, యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రీటెయిల్ ఫెడరేషన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. తమ కంపెనీలకు ప్రతిభావంతులైన నిపుణులు రాకుండా ఈ నిబంధనలు అడ్డుకుంటున్నాయని ఆయా సంస్థలు తమ పిటిషన్లలో తెలిపాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజా నిర్ణయం వెలువరించింది.