వ్యవసాయ బిల్లుల ఆమోదం ఏకపక్షం అంటున్న టీఆర్ఎస్ సర్కారు... వీఆర్వోల తొలగింపుపై చర్చించిందా?: ఎంపీ అరవింద్
- టీఆర్ఎస్, బీజేపీ మధ్య వ్యవసాయ బిల్లుల రగడ
- ఈ చట్టంతో రైతులకు పెట్టుబడి సమస్య ఉండదన్న అరవింద్
- రైతు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని వివరణ
ఇదిలావుంచితే, కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టంపై టీఆర్ఎస్ తీవ్ర వ్యతిరేకత కనబరుస్తోంది. పార్లమెంటులో ఓటింగ్ సందర్భంగా కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. వ్యతిరేకంగా ఓటు వేసింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకే ఈ చట్టం తీసుకువచ్చారంటూ టీఆర్ఎస్ అగ్రనేతలు ఆరోపిస్తున్నారు. ఈ చట్టంతో రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుందని ఎలా చెప్పగలరంటూ కేకే వంటి సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు.