ప్రధాని మోదీపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ జీవీఎల్!
- రాముడిని మోదీ సతీసమేతంగా దర్శించుకోవాలన్న కొడాలి నాని
- కొడాలి నానిని పదని నుంచి తొలగించాలని జీవీఎల్ డిమాండ్
- వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని వ్యాఖ్య
కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. మోదీ, యోగి ఆదిత్యనాథ్ ల నిబద్ధత, ఆచరణ తెలిసి కూడా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. కొడాలి నానిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని... ఈ రెండు పార్టీలకు ఏపీ ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు.