మరో వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేయనున్న రష్యా

Another VAccine from Russia
  • ఇప్పటికే స్పుత్నిక్ వీ పేరిట ఓ వ్యాక్సిన్
  • ఎపివాక్ ను డెవలప్ చేసిన సైబీరియాకు చెందిన సంస్థ
  • అక్టోబర్ 15 నాటికి గుర్తించనున్న రష్యా
ఇప్పటికే స్పుత్నిక్ వీ పేరిట ఓ వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన రష్యా, మరో కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేయనుంది. సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ డెవలప్ చేస్తున్న ఎపివాక్ కరోనా వ్యాక్సిన్ ను అక్టోబర్ 15 నాటికి తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని, రష్యా వినియోగదారుల భద్రతా సంస్థ పేర్కొంది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన మొదటి దశ ట్రయల్స్ ఫలితాలు గత వారమే పూర్తయ్యాయి.

కాగా, రష్యా తయారీ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ మూడవ దశ ప్రయోగాల్లో ఇండియా కూడా భాగం కానుంది. ఈ వ్యాక్సిన్ కోసం దాదాపు 10 దేశాలు రష్యాతో డీల్ ను కుదుర్చుకోగా, ఇండియాకు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా ఈ జాబితాలో ఉందన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Russia
Vaccine
EpiVacCorona

More Telugu News