దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మిస్తాం: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
- గ్రేటర్ నోయిడా, నోయిడాలలో అనువైన స్థలం చూడాలని ఆదేశం
- అందమైన, అతిపెద్ద ఫిలింసిటీ నిర్మిస్తామని ప్రకటన
- మీరట్ మెట్రో ప్రాజెక్టును 2025 కల్లా పూర్తి చేయాలన్న సీఎం
గౌతం బుద్ధనగర్ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద, అందమైన ఫిలింసిటీని నిర్మించనున్నట్టు చెప్పారు. దీని నిర్మాణం కోసం నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రే వే సమీపంలో స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే, మీరట్‌లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టును మార్చి 2025లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.