Nellore District: ప్రేమించిన అబ్బాయికి దూరం చేస్తున్నార‌న్న బాధతో బాలిక ఆత్మ‌హత్య

girl commits suicide
  • నెల్లూరులో ఘ‌ట‌న‌
  • ప్రేమికుడి నుంచి విడ‌దీసిన త‌ల్లిదండ్రులు
  • మ‌రో అబ్బాయితో నిశ్చితార్థం
నెల్లూరు గ్రామీణ ప‌రిధికి చెందిన తొమ్మిదవ తరగతి చదివిన ఓ మైన‌ర్ బాలిక ఓ అబ్బాయితో ప్రేమ‌లో ప‌డింది. విషయం తెలిసి, ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆమె కుటుంబ స‌భ్యులు ఆమెను బంధువుల ఇంటికి పంపించి, అక్క‌డే ఉండమని చెప్పారు.  

కొన్నాళ్లయ్యాక, ఇటీవల ఆమెను ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆమెకు మరో యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. దీంతో ఆమె మ‌న‌స్తాపం చెందింది. బాత్‌రూంలోకి వెళ్లి, పైన ఉన్న‌ ఇనుపరాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విష‌యాన్ని గుర్తించిన కుటుంబ స‌భ్యులు 108కి ఫోన్ చేశారు.

వైద్య సిబ్బంది వ‌చ్చి పరీక్షించి, ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. తాను మ‌న‌సుప‌డ్డ యువ‌కుడిని ఇచ్చి పెళ్లి చేయ‌లేద‌న్న కార‌ణంగానే ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు.
Nellore District
Crime News

More Telugu News