వైఎస్సార్ లాగా, సీఎం జగన్ లాగా చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటీ లేదు: విజయసాయిరెడ్డి
- వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించిన సీఎం జగన్
- అబద్ధాలు చెబుతాడంటూ చంద్రబాబుపై విజయసాయి వ్యాఖ్యలు
- పెట్టుబడిదారీ ముఠా తయారుచేశాడంటూ విమర్శలు
వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా 30 లక్షల 16 వేల మంది గర్భవతులు, పిల్లలు నాణ్యమైన పోషకాహారం పొందుతారని విజయసాయి వెల్లడించారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పును చూస్తారని తెలిపారు.