భార్యను వేధిస్తున్న సినీ రచయితపై కేసు నమోదు
- గత కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటున్న యర్రంశెట్టి
- కేసు వెనక్కి తీసుకోకుంటే నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో పెడతానని బెదిరింపులు
- ఆమె స్నేహితుల వద్ద అసభ్యకర వ్యాఖ్యలు
- ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు
అయితే, గత కొంతకాలంగా రమణ గౌతమ్ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో భార్యకు ఫోన్లు చేసి బెదిరించడం మొదలు పెట్టాడని యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో పెడతానని, సినీ పరిశ్రమలో ఉన్న తన స్నేహితుల వద్ద అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.