ఎస్పీ బాలు ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి

MGM Hopsital releases latest health bulletin of SP Balasubrahmanyam
  • బాలు స్పృహలోనే ఉన్నారని వెల్లడి
  • చికిత్సకు స్పందిస్తున్నారన్న ఆసుపత్రి వర్గాలు
  • నెల రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో బాలుకు కరోనా చికిత్స
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత నెల రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆగస్టు మొదటివారంలో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఆయన కొన్నిరోజులకే విషమ పరిస్థితిలో పడ్డారు. అప్పటినుంచి ఐసీయూలోనే వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. మధ్యలో ఓసారి ఆరోగ్యం బాగా క్షీణించినా, క్రమంగా కోలుకుంటూ కుటుంబ సభ్యుల్లోనూ, అభిమానుల్లోనూ ఆనందోత్సాహాలు కలిగించారు.

తాజాగా ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎస్పీ బాలు ఆరోగ్యంపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేశాయి. ఆయనకు ఇంకా వెంటిలేటర్ పై ఎక్మో సాయంతో చికిత్స కొనసాగుతూనే ఉందని ఆ బులెటిన్ లో తెలిపారు. ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. తమ ఆసుపత్రికి చెందిన భిన్న వైద్య విభాగాల నిపుణులు బాలు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు.

.
Go Back to Shorts
MGM Hsopital
Health Bulletin
SP Balasubrahmanyam
Corona Virus
Chennai

More Telugu News