సీఎం జగన్ నిర్ణయంతో ప్రభుత్వంపై భారం తగ్గుతుంది: పేర్ని నాని
- ఉచిత విద్యుత్ పథకంలో రైతులకు నగదు బదిలీ
- రాష్ట్ర కేబినెట్ ఆమోదం
- కొత్తగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు
ట్రాన్స్ మిషన్ నష్టాలు కానీ, డిస్కంల నష్టాలు కానీ, అన్నింటిని కలుపుకుంటే ఒక యూనిట్ కు రూ.6.70 పడుతోందని, ఈ భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వమే 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోందని, తద్వారా ఒక యూనిట్ కు రూ.2.50 లోపే పడుతుందని చెప్పారు. భవిష్యత్ లో ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ విధానంతో రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగేలా సీఎం జగన్ సోలార్ ప్రాజెక్టు నిర్ణయం తీసుకున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.