బీసీసీఐ మాజీ చీఫ్ ఏసీ ముత్తయ్యను 'ఉద్దేశపూర్వక ఎగవేతదారు'గా ప్రకటించిన ఐడీబీఐ
- రూ.508 కోట్లు ఎగవేసినట్టు ఆరోపణలు
- ఇప్పటికే ముత్తయ్యపై సీబీఐ కేసులు
- భారత క్రికెట్ తో సన్నిహిత సంబంధాలు
ఏసీ ముత్తయ్య, ఫారూఖ్ ఇరానీతో కలిసి ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటున్నారు. ఐడీబీఐ సహా మరో మూడు బ్యాంకులకు టోకరా వేశారంటూ 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ మరుసటి ఏడాది సిండికేట్ బ్యాంకును వంద కోట్ల రూపాయలకు పైగా మోసం చేసినట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ మరో కేసు నమోదుచేసింది. నకిలీ పత్రాలతో రుణాలు తీసుకుని, ఆ నిధులను దారి మళ్లించినట్టు వారిద్దరిపై ఆరోపణలు ఉన్నాయి.
ఏసీ ముత్తయ్యకు భారత క్రికెట్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన 1994-95, 2001-02 సీజన్లకు గాను తమిళనాడు క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999 నుంచి 2001 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు.