ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

Corona spreading continues in Andhra Pradesh
  • గత 24 గంటల్లో 8,601 మందికి కరోనా పాజిటివ్
  • 86 మంది మృత్యువాత
  • తాజాగా 8,741 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా రక్కసి ప్రభావం అధికంగానే ఉంది. గడచిన 24 గంటల్లో 8,601 పాజిటివ్ కేసులు రాగా, 86 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,712కి చేరగా, కరోనా మృతుల సంఖ్య 3,368కి పెరిగింది. తాజాగా 8,741 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఈ మహమ్మారి వైరస్ నుంచి విముక్తులైన వారి సంఖ్య 2,68,828గా నమోదైంది. ప్రస్తుతం 89,516 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Spreading
Andhra Pradesh
Positive Cases
Deaths
COVID-19

More Telugu News