ఏపీ కరోనా అప్ డేట్: ఒక్కరోజులో 91 మంది మృతి, 9,544 కొత్త కేసులు
- చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 మంది మృతి
- 3,092కి పెరిగిన మొత్తం మరణాల సంఖ్య
- తాజాగా 8,827 మందికి కరోనా నయం
కాగా, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తాజాగా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు. ప్రస్తుతం 87,803 మంది చికిత్స పొందుతుండగా, మరో 8,827 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,34,940 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,44,045 మంది కోలుకున్నారు.