Pragya Jaiswal: క్రిష్ దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ మరోసారి?

Pragya Jaiswal to act under the direction of Krish again
షార్ట్స్‌లో చూడండి
గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'కంచె' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాలతార ప్రగ్యా జైస్వాల్ మళ్లీ ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశాన్ని పొందుతోంది. క్రిష్ తాజాగా 'ఉప్పెన' ఫేం వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రొమాంటిక్ మూవీగా తెరకెక్కే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో కనిపించే రైతు కూలీ పాత్రను ఆమె పోషిస్తోంది.

అయితే, ఈ చిత్రంలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా వుందట. దాని కోసం ప్రగ్యా జైస్వాల్ ని తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నట్టు సమాచారం. సినిమాలో ఇది కీలకమైన పాత్ర అని అంటున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు సమీపంలోని వికారాబాద్ అడవుల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. సింగిల్ షెడ్యూల్ లో దీని షూటింగును పూర్తి చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో చేసే చిత్రం షూటింగును ప్రారంభిస్తారు.    
Go Back to Shorts
Pragya Jaiswal
Krish
Rakul Preet Singh
Vaishnav Tej

More Telugu News