ఇలాంటి ప్రాంతాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయిస్తారా?: సోము వీర్రాజు ఫైర్
- వరద నీటిలో మునిగిపోయే స్థలాలను కేటాయించారు
- చేసిన తప్పులను సరిదిద్దుకోండి
- అడ్డగోలుగా ఇలాంటి భూములను కొనుగోలు చేస్తున్నారు
ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి, ఒక యూనివర్శిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు స్వీకరించారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించకపోగా... ఇప్పుడు అడ్డగోలుగా ఇలాంటి భూములను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరును కొనసాగిస్తే... ప్రభుత్వంపై బీజేపీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.