అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన బీజేపీ నేత
- గతంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన రామాంజనేయులు
- మద్యం తరలిస్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
- రూ.6 లక్షల విలువైన మద్యం స్వాధీనం
గుడివాక రామాంజనేయులుతో పాటు మచ్చా సురేశ్, కె.నరేశ్ అనే వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గుడివాక రామాంజనేయులును ఏ-1గా పేర్కొన్నారు. రామాంజనేయులు 2019లో మచిలీపట్నం ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.