Promo: నిజమైన భావోద్వేగాలు... అసలైన వినోదం... వస్తోంది బిగ్ బాస్ సీజన్-4: సరికొత్త ప్రోమోలో నాగ్ సందడి

  • త్వరలో బిగ్ బాస్-4
  • తాజా ప్రోమోలో నాగ్ ట్రిపుల్ యాక్షన్
  • ఇలాంటి వినోదం ఎప్పుడూ చూసివుండరన్న నాగ్
Latest promo of Bigg Boss season four released

త్వరలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం కానుందనడానికి సంకేతంగా స్టార్ మా చానల్ నుంచి మరో ప్రోమో వచ్చింది. మొన్న రిలీజ్ చేసిన ప్రోమోలో వృద్ధుడి వేషంలో ఉన్న నాగార్జున ఓ టెలిస్కోప్ తో బయటి ప్రపంచాన్ని చూస్తుంటాడు. గోపీ అంటూ నాగ్ పలికిన డైలాగుతో ఆ ప్రోమో ముగుస్తుంది. దానికి కొనసాగింపుగా తాజా ప్రోమో రిలీజైంది. ఇందులో ముగ్గురు నాగార్జునలను చూడొచ్చు.

వృద్ధుడి వేషంలో నాగ్ తో పాటు కుర్ర నాగ్ కూడా బయటి ప్రపంచాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ దశలో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించే నాగార్జున వచ్చి దీన్ని మించిన ఎంటర్టయిన్ మెంట్ మరొకటి ఉందని, అదే బిగ్ బాస్ సీజన్-4 అంటూ చెబుతాడు. అసలైన భావోద్వేగాలు, నిజమైన వినోదం... ఇంతకుముందెప్పుడూ చూసి ఉండరు అంటూ వ్యాఖ్యానిస్తాడు. మొత్తమ్మీద ఈ ప్రోమోతో బిగ్ బాస్-4 హైప్ మరింత అధికమైంది.


More Telugu News