ఏపీ కరోనా అప్ డేట్స్:  ఒక్కరోజులో 87 మంది మృతి... 8,732 కొత్త కేసులు

Corona updates of Andhra Pradesh state
  • ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,81,817
  • గత 24 గంటల్లో 10,414 మంది డిశ్చార్జి
  • ఇంకా 88,138 మందికి చికిత్స
ఏపీలో కరోనా రక్కసి శరవేగంతో వ్యాపిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెల్లడవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 8,732 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,817కి చేరింది. ఇక రాష్ట్రంలో 87 మంది మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 2,562కి పెరిగింది. తాజాగా రికార్డు స్థాయిలో 10,414 మందిని డిశ్చార్జి చేశారు. ఈ నేపథ్యంలో, కరోనా నుంచి విముక్తులైన వారి సంఖ్య 1,91,117గా నమోదైంది. ఇంకా 88,138 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Updates
Andhra Pradesh
Deaths
Positive Cases

More Telugu News