వెంకటేశ్ ఇప్పట్లో షూటింగ్ చేయనట్టే!
- గతేడాది వెంకటేశ్ నుంచి ఎఫ్ 2', 'వెంకీమామ'
- శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తాజాగా 'నారప్ప'
- తదుపరి షెడ్యూలు షూటింగ్ జనవరి నుంచి
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూలు షూటింగ్ లాక్ డౌన్ కి ముందు అనంతపురం జిల్లాలోనూ, తమిళనాడు సరిహద్దుల్లోనూ జరిగింది. ఇక ఇప్పుడు కరోనా వ్యాప్తి ముమ్మరంగా ఉండడంతో ఇప్పట్లో ఈ చిత్రం తదుపరి షూటింగులో పాల్గొనడానికి వెంకటేశ్ ఆసక్తి చూపడం లేదట. అందుకే, వచ్చే ఏడాది జనవరి వరకు షూటింగును వాయిదా వేసినట్టు చెబుతున్నారు. జనవరి నుంచి మిగతా షూటింగ్ నిర్వహించి వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో వెంకటేశ్ సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తోంది.