Telangana: ఎన్జీటీలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విచారణ.. కౌంటర్‌ అఫిడవిట్ ద్వారా వ్యతిరేకించిన తెలంగాణ

ngt reserves verdict on rayalaseema irrigation scheme
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఒప్పందాలకు విరుద్ధంగా ఉందంటూ చెబుతోంది. దీనిపై ఈ రోజు ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో వాదనలు ముగిశాయి.  40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులు ఎత్తిపోసేలా మార్చారంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై  ధర్మాసనం ఈ విచారణ జరిపింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతదేనని ఏపీ ప్రభుత్వం తరుఫున సీనియర్ న్యాయవాది చెప్పారు. తమకు రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని, ఈ కేసును ముగించాలని అన్నారు. అయితే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కౌంటర్ అఫిడవిట్ ద్వారా తెలంగాణ వ్యతిరేకించింది. ఏపీ చేపట్టిన ఆ పథకం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని చెప్పింది. దీంతో తమ వైఖరేంటో వారం రోజుల్లో తెలియజేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
Go Back to Shorts
Telangana
Andhra Pradesh

More Telugu News