కరోనా అప్ డేట్స్ ... ఏపీలో 24 గంటల్లో 89 మంది మృతి!

Corona causes more deaths in AP
  • రాష్ట్రంలో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
  • 1842కి పెరిగిన మరణాలు
  • కొత్తగా 7,594 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా మరణాల ఉద్ధృతి ఆందోళనకర రీతిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 89 మంది కరోనాతో మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 10 మంది కన్నుమూశారు. అనంతపురం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొమ్మిదేసి మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1,842కి పెరిగింది. అటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తీవ్రస్థాయిలో పైపైకి ఎగబాకుతోంది. తాజాగా 10,171 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. కొత్తగా 7,594 మందిని డిశ్చార్జి చేశారు. ఇంకా 84,654 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Deaths
Positive Cases
COVID-19

More Telugu News