CM Ramesh: పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ కి కరోనా పాజిటివ్

CM Ramesh tests with Corona positive
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని... డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు. రమేశ్ కు కరోనా సోకిందనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కూడా కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Go Back to Shorts
CM Ramesh
BJP
Corona Virus

More Telugu News