మద్యం బాటిళ్ల లోడుతో వెళ్తూ బోల్తా పడ్డ ట్రక్కు.. మద్యం కోసం ఎగబడ్డ స్థానికులు.. వీడియో ఇదిగో

మద్యం బాటిళ్ల లోడుతో వెళ్తూ బోల్తా పడ్డ ట్రక్కు.. మద్యం కోసం ఎగబడ్డ స్థానికులు.. వీడియో ఇదిగో

Locals rush to loot liquor bottles after a truck carrying it overturned in Kawardha
  • ఛత్తీస్‌గఢ్‌లో ఘటన
  • 200 కార్టన్ల మద్యం బాటిళ్లు తీసుకెళుతుండగా ఘటన
  • వాటి విలువ రూ.20 లక్షలు
మద్యం బాటిళ్ల లోడుతో వెళుతోన్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు మద్యం బాటిళ్లను చోరీ చేసి తీసుకెళ్లడంలో పోటీ పడ్డారు. కొందరిని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ చాలా మద్యం బాటిళ్లను స్థానికులు లూటీ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్‌ఫోన్లలో చిత్రీకరించారు.

ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధాలో చోటు చేసుకుంది. అక్కడి ఎక్సైజ్‌ అధికారి మీడియాతో మాట్లాడుతూ... ఆ ట్రక్కు 200 కార్టన్ల మద్యం బాటిళ్లు తీసుకెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని, వాటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ట్రక్కు బోల్తా పడడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని చెప్పారు.
Chhattisgarh
Viral Videos

More Telugu News