ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి దుబ్బాక ప్రాంతానికి తీరని లోటు: జనసేన

janasena on ramalingareddy demise
  • నాదెండ్ల మనోహర్ సంతాపం
  • ఆయనతో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తు తెచ్చుకున్న నాదెండ్ల
  • అప్పట్లో సర్వశిక్ష అభియాన్‌ కుంభకోణంపై హౌస్ కమిటీ
  • తాను ఛైర్మన్‌గా, రామలింగారెడ్డి సభ్యుడుగా ఉన్నామని వ్యాఖ్య
దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి వార్త తెలిసి చింతించానంటూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పాత్రికేయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన అప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో తపించారని చెప్పారు.

2004లో దొమ్మాట స్థానం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీకి వచ్చారని గుర్తు చేశారు. సర్వశిక్ష అభియాన్‌ కుంభకోణంపై ఏర్పాటైన హౌస్ కమిటీకి తాను ఛైర్మన్‌గా వ్యవహరిస్తే, రామలింగారెడ్డి అందులో సభ్యుడిగా ఉన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి దుబ్బాక ప్రాంతానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
                 
Go Back to Shorts
Janasena
Nadendla Manohar
Telangana

More Telugu News