తెలంగాణలో కొత్తగా 1,286 మందికి కరోనా పాజిటివ్‌
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 1,286 మందికి కరోనా పాజిటివ్‌

Media Bulletin on status of positive cases COVID19 in Telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 68,946
  • ఆసుపత్రుల్లో 18,708 మందికి చికిత్స
  • మృతుల సంఖ్య మొత్తం 563
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 391 కరోనా కేసులు
తెలంగాణలో కొవిడ్‌-19 విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,286 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 68,946కి చేరింది. ఆసుపత్రుల్లో 18,708 మందికి చికిత్స అందుతోంది. మృతుల సంఖ్య మొత్తం 563కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 391 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 121 కేసులు నమోదయ్యాయి.

.
Corona Virus
COVID-19
Telangana

More Telugu News