చిత్తూరు జిల్లాలో దారుణం: చిన్నారులకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య
భార్య అనారోగ్యం భరించలేక భర్త ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానం
పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్య
అంత్యక్రియలకు ఏటీఎం కార్డులో డబ్బులున్నాయని సూసైడ్ నోట్
గ్రామంలో విషాద ఛాయలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్య
అంత్యక్రియలకు ఏటీఎం కార్డులో డబ్బులున్నాయని సూసైడ్ నోట్
గ్రామంలో విషాద ఛాయలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మృతులను దామోదర్, ఆయన భార్య నిర్మల, కుమారుడు దిలీప్ (8వ తరగతి), కుమార్తె శ్రీవిద్య (6వ తరగతి)గా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా నిర్మల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, ఆమె పరిస్థితిని చూడలేకపోయిన దామోదర్.. భార్యకు, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, ఆపై తానూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఘటనా స్థలంలో లభించిన ఆత్మహత్య లేఖలో, తమ మరణానికి ఎవరూ బాధ్యులు కాదని దామోదర్ పేర్కొన్నారు. అంత్యక్రియల ఖర్చుల కోసం ఏటీఎం కార్డుల్లో నగదు ఉందని, వాటిని వినియోగించుకోవాలని ఆయన ఆ లేఖలో కోరడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
సమాచారం అందుకున్న చిత్తూరు రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మరణం బంధువులను, గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా కుటుంబంలో ఎవరూ మిగలకపోవడం స్థానికులను కన్నీటిపర్యంతం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.