చైనాకు దీటుగా దెప్సాంగ్ వద్ద 15 వేల బలగాలను మోహరించిన భారత్
- దెప్సాంగ్ ప్రాంతాల్లో 17 వేల మంది సైనికులను మోహరించిన చైనా
- చైనాకు వణుకుపుట్టేలా భారీగా బలగాలను తరలించిన భారత్
- టీడబ్ల్యూడీ బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి రోడ్డు నిర్మించే యోచనలో చైనా
దీంతో అప్రమత్తమైన భారత్.. చైనా ఏదైనా దుస్సాహసానికి దిగాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేలా పెద్ద ఎత్తున బలగాలను తరలించినట్టు సమాచారం. ముఖ్యంగా కారకోరం పాస్ దగ్గర్లోని పీపీ 1 దగ్గరి నుంచి దెప్సాంగ్‌కు పెద్ద ఎత్తున బలగాలను తరలించినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. మొత్తం 15 వేల మంది జవాన్లు అక్కడ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ఇటీవల భారత భూభాగంలోని పీపీ 7, పీపీ 8 మధ్య చైనా గతంలో నిర్మించిన చిన్నపాటి వంతెనను భారత సైనికులు కూల్చివేశారు. దీంతో ఇప్పుడు టీడబ్ల్యూడీ బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి కారకోరం కనుమ వరకు రోడ్డు నిర్మించాలని చైనా భావిస్తోంది. అదే జరిగితే రెండు బెటాలియన్ల మధ్య దూరం చాలా వరకు తగ్గిపోతుంది.