కేటీఆర్‌తో పాటు సంతోష్ కుమార్‌కు రాఖీ కట్టిన కవిత
Add ap7am to your home Screen

కేటీఆర్‌తో పాటు సంతోష్ కుమార్‌కు రాఖీ కట్టిన కవిత

kavita ties rakhi to ktr
  • ప్రగతి భవన్‌లో రాఖీ పండుగ
  • కేటీఆర్‌కు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, సునీతారెడ్డి రాఖీలు
  • అన్నాచెల్లెళ్ల అనుబంధం అన్నింటి కంటే అద్భుతమైనదన్న కవిత
రాఖీ పండుగ సందర్భంగా తన సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టారు. ప్రగతి భవన్‌లో ఆమె కేటీఆర్‌తో పాటు సంతోష్‌ కుమార్‌కు కూడా రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు.
                       

అలాగే, కేటీఆర్‌కు తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సునీతారెడ్డి కూడా రాఖీలు కట్టారు. ఈ సందర్భంగానూ వారు మాస్కులు ధరించారు. 'అన్నాచెల్లెళ్ల అనుబంధం అన్నింటి కంటే అద్భుతమైనది. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు' అని కవిత తెలిపారు.
KTR
K Kavitha
Telangana

More Telugu News