కర్ర సాయంతో గర్భిణిని మోసుకెళ్లిన బంధువులు.. వీడియో ఇదిగో
- ఛత్తీస్‌గఢ్‌లో ఘటన
- గ్రామంలో రోడ్డు సదుపాయాలు లేని వైనం
- కాన్పు కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన బంధువులు
ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలోని కడ్నాయి గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు లభ్యమైంది. ఆమెను నలుగురు బంధువులు మోసుకుంటూ తీసుకెళ్లారు. వర్షాలకు తమ గ్రామంలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ఆమెను వాటిని దాటిస్తూ వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మొదట ఓ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లి అక్కడి నుంచి కాన్పు కోసం మరో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.