ఏపీలో కొత్తగా 10,376 పాజిటివ్ కేసుల నమోదు!
- మరో 68 మంది మృతి
- మొత్తం కేసుల సంఖ్య 1,40,933
- గత 24 గంటల్లో 3,822 డిశ్చార్జి
అటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 68 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది చనిపోయారు. ఓవరాల్ గా చూస్తే రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,349కి పెరిగింది. కొత్తగా 3,822 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఇంకా 75,720 మంది చికిత్స పొందుతున్నారు.