హైదరాబాద్‌లో తగ్గుతూ.. జిల్లాల్లో పెరుగుతున్న కేసులు.. బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం
- నిన్న మొత్తం 1610 కేసులు నమోదు, 9 మంది మృతి
- రాష్ట్రంలో 57 వేలు దాటేసిన కేసులు
- ఇప్పటి వరకు 3,79,081 మందికి కరోనా పరీక్షలు
కరోనా నుంచి నిన్న 803 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 42,909కి పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 13,753 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 531 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. ఆ తర్వాత అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 340, రంగారెడ్డి జిల్లాలో 172, వరంగల్ అర్బన్ 152, మేడ్చల్ మల్కాజిగిరిలో 113, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో 48 చొప్పున, సూర్యాపేటలో 35, ములుగులో 32, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 26 చొప్పున, మహబూబ్‌నగర్‌లో 23 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఇప్పటి వరకు 3,79,081 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇంకా 809 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.
.