ఏపీలో లక్ష దాటిన పాజిటివ్ కేసులు... వెయ్యి దాటిన మరణాల సంఖ్య

Corona positive cases crosses one lakh mark in AP
  • గత 24 గంటల్లో 6,051 కొత్త కేసులు
  • మరో 49 మంది మృతి
  • కరోనా నుంచి కోలుకున్న 3,234 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష దాటగా, కరోనా మృతుల సంఖ్య 1000 దాటింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 6,051 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,210 కేసులు రాగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 120 కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,349కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరో 49 మంది మృతి చెందగా, ఇప్పటివరకు సంభవించిన మరణాల సంఖ్య 1,090కి పెరిగింది. పూర్తి ఆరోగ్యం సంతరించుకున్న 3,234 మందిని డిశ్చార్జి చేశారు. ఇంకా 51,701 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Positive Cases
One Lakh
Andhra Pradesh
COVID-19

More Telugu News