నెల్లూరు జిల్లా కావలి సమీపంలో క్షుద్రపూజల కలకలం!

Black Magic at Kavali forest area in Nellore district
టెక్నాలజీ విస్తృతస్థాయిలో ప్రజాజీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లోనూ చేతబడి, బాణామతి, చిల్లంగి వంటి క్షుద్రపూజలను నమ్మేవారున్నారంటే అతిశయోక్తి కాదు.  నెల్లూరు జిల్లా కావలి వద్ద కనిపించిన క్షుద్రపూజల ఆనవాళ్లే అందుకు నిదర్శనం. కావలి సమీపంలోని అటవీప్రాంతంలో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించినట్టుగా కొన్ని చిహ్నాలు కనిపించాయి. సున్నంతో ఓ మహిళ బొమ్మను గీసి ఆ బొమ్మ మధ్యలో ఓ అమ్మాయి ఫొటో ఉంచారు. గుమ్మడి కాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో అక్కడంతా భయానకంగా ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అయితే ఇది ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు.
Go Back to Shorts
Black Magic
Kavali
Forest Area
Nellore District

More Telugu News