Corona Virus: తెలంగాణలో మరో 1,473 మందికి సోకిన కరోనా

Media Bulletin on status of positive cases COVID19 in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణ  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకు (24 గంటల్లో) 9,817 మంది నమూనాలను పరీక్షించగా, వారిలో 1,473 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 506 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,532 అని పేర్కొంది.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 12,955  మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 42,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 471కి చేరింది.    

తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించి పూర్తి వివరాలు..
       
                
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News