Corona Virus: దేశంలో మరో 48,661 మందికి కొత్తగా కరోనా

Singleday spike of 48661 positive cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ వేల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 48,661 మందికి కొత్తగా కరోనా సోకింది.  అదే సమయంలో 705 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 13,85,522కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 32,063కి పెరిగింది. 4,67,882 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 8,85,577 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,62,91,331 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 4,42,263 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News