Nellore District: నెల్లూరు సమీపాన ఆకాశంలో అద్భుతం!

  • జాతీయ రహదారిపై కనువిందు
  • సూర్యాస్తమయం వేళ ఘటన
  • మర్రిపాడు సమీపంలో మేఘాల దృశ్యాలు
Wonder Visuals in Sky Near Nellore

నెల్లూరు జిల్లాలో ఆకాశంలో అద్భుత దృశ్యాలు కనిపించాయి. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారంతా ఈ దృశ్యాలను తమ స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరించడంతో అవి వైరల్ అయ్యాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నట్టుగా కాసేపు కనిపించిన మేఘాలు, ఆపై నిదానంగా మంచు కొండల మాదిరిగా మారిపోయాయి. మర్రిపాడు సమీపంలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఆకాశంలో చాలా ఎత్తున పలుచటి మేఘాలు ఏర్పడటం, అదే సమయంలో సూర్యాస్తమయం కావడంతో, సూర్యుని కాంతి వాటిపై పడి, ఈ విధమైన అద్భుతం గోచరించింది. ఆపై సూర్యుడు కిందకు దిగేసమయంలో కాంతి తగ్గి, మేఘాల రంగు మారిపోతూ కనిపించింది. ఆ దృశ్యాలను మీరూ చూడవచ్చు.

More Telugu News