Nithin: మెహెందీ వేడుకలో నితిన్, షాలిని... సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు

  • ఓ ఇంటివాడు కాబోతున్న నితిన్
  • ఈ నెల 26న షాలినితో వివాహం
  • ఇటీవలే నిశ్చితార్థం
Mehendi completes for actor Nithin and Shalini

టాలీవుడ్ హీరో నితిన్, షాలినీల వివాహం ఈ నెల 26న హైదరాబాద్ లో జరగనుంది. ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం వేడుక జరిగింది. తాజాగా వీరి సంగీత్, మెహెందీ ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలను ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన పంచుకున్నారు. ఈ ఫొటోల్లో నితిన్, షాలిని ఎంతో జాలీ మూడ్ లో దర్శనమిచ్చారు.

More Telugu News